గ్రూప్ 2 వాయిదాపై ఆగస్టు 14న ఫైనల్ డెసిషన్

గ్రూప్ 2 వాయిదాపై ఆగస్టు 14న ఫైనల్ డెసిషన్

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 2 వాయిదాపై TSPSC ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో  ఆగస్టు 14 (సోమవారం )న చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 

ఆగస్టు 2 నుండి 30 వరకు వివిధ రకాల 21 పోటీ పరీక్షలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల  29, 30 న గ్రూప్ 2 కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్ 2 పరీక్ష రాయడం అభ్యర్థులకు ఇబ్బంది అని వివరించారు. ప్రభుత్వం  అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. గ్రూప్ 2 కోసం 5.5 లక్షలు మంది అప్లై చేసుకున్నారని.. ఇందులో 90 శాతం మంది పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. 

గ్రూప్ 2 పరీక్షకు 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ, గురుకుల పరీక్షకు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని TSPSC కౌన్సిల్ తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. 1535 సెంటర్ లలో పరీక్షలు జరిగే స్కూల్, కాలేజ్ లకు సెలవులు ప్రకటించామని పేర్కొంది. అయితే గ్రూప్ 2 పరీక్షల అభ్యర్థులు 5.5 లక్షల మంది ఉంటే అందులో 150 మంది మాత్రమే పిటిషన్ వేశారని TSPSC కౌన్సిల్ తెలిపింది.

గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై 2023 ఆగస్టు 14న (సోమవారం) నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టుకు TSPSC  తరపున న్యాయవాది తెలిపారు. అయితే ఫైనల్ గా సోమవారం గ్రూప్ 2 పరీక్షపై తుది నిర్ణయం తీసుకోవాలని TSPSCకి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ పిటీషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 14 ( సోమవారం)కు వాయిదా వేసింది.