చదువొక్కటే కాదు విలువలూ నేర్పించాలి: హరీష్ రావు

చదువొక్కటే కాదు విలువలూ నేర్పించాలి: హరీష్ రావు

ఎడ్యుకేషన్ అంటే చదువొక్కటే కాదన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, పాటలు, మానవతా విలువలు నేర్పించాలన్నారు. హైదరాబాద్ HICCలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఎడ్యుకేషన్ ఎక్స్ పోను హరీశ్ ప్రారంభించారు. చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు హరీశ్. విద్యా వ్యవస్థను మార్చడానికే ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు.