ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోరు.. ‘సిటీ విత్ ఇన్ ఏ సిటీ’గా ఎదుగుదల: ఏఎస్బీఎల్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోరు.. ‘సిటీ విత్ ఇన్ ఏ సిటీ’గా ఎదుగుదల: ఏఎస్బీఎల్

హైదరాబాద్​, వెలుగు:  హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 'సిటీ విత్ ఇన్ ఏ సిటీ'గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంతం ఉద్యోగం, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి సౌకర్యాలతో విస్తరిస్తోందని రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్​బీఎల్) తెలిపింది. 

ఈ ప్రాంతంలో ఆస్తులపై పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక్కడ 2024–-25 ఆర్థిక సంవత్సరంలో 3బీహెచ్‌‌‌‌‌‌‌‌కే ఇళ్ల అద్దెలు 25.7 శాతం పెరిగాయి. దీంతో అద్దెల రాబడి  4-6 శాతానికి చేరింది. హైదరాబాద్ నగర సగటు అద్దె రాబడి 2-3 శాతం మాత్రమే ఉంది.   2025 మొదటి క్వార్టర్​లో దేశంలోని మొత్తం టెక్ లీజింగ్‌‌‌‌‌‌‌‌లో 21 శాతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే జరిగింది. 

ఇందులో అధికభాగం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచే ఉందని ఏబీఎస్​బీఎల్   ఫౌండర్, సీఈఓ అజితేష్ కొరుపోలు చెప్పారు.