క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో ఫించ్

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో ఫించ్

మెల్‌‌‌‌బోర్న్‌‌: ఒత్తిడి, ఫామ్‌‌లేమితో ఇబ్బందిపడుతున్న ఆస్ట్రేలియా వైట్‌‌బాల్‌‌ కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌.. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ గుడ్‌‌బై చెప్పాలని భావిస్తున్నాడు. శనివారం అధికారిక నిర్ణయం ప్రకటించే చాన్స్‌‌ ఉందని ఆసీస్‌‌ మీడియా పేర్కొంది. తక్షణమే వన్డేల నుంచి తప్పుకోనున్న ఫించ్‌‌.. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత షార్ట్‌‌ ఫార్మాట్‌‌కూ వీడ్కోలు చెప్పే యోచనలో ఉన్నాడు. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాలో బరిలోకి దిగుతున్న ఆసీస్‌‌ను సొంతగడ్డపై మరోసారి విజేతగా నిలిపి కెరీర్‌‌కు గుడ్‌‌బై చెబితే బాగుంటుందని ఫించ్‌‌ భావిస్తున్నాడు.ః

ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న అతను ఎక్కువ కాలం క్రికెట్‌‌ ఆడే చాన్స్‌‌ కూడా లేదు. దీనికితోడు కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని ఫించ్‌‌ రిటైర్మెంట్‌‌ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 11 ఏళ్ల కెరీర్‌‌లో 5 టెస్ట్‌‌లు (278 రన్స్‌‌), 145 వన్డేలు (5401 రన్స్‌‌), 92 టీ20 (2855 రన్స్‌‌)లు ఆడాడు. ఫించ్‌‌ ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు గుడ్‌‌బై చెప్పినా.. ఫ్రాంచైజీ క్రికెట్‌‌కు అందుబాటులో ఉండే చాన్స్‌‌ ఉంది.