
- రూ.50 లక్షలు చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై: మీమ్స్, ట్రోల్స్ పేరుతో సెలబ్రిటీలపై ఇష్టానుసారం వీడియోలు చేసే యూట్యూబర్లకు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఓ హెచ్చరికలా మద్రాస్ హైకోర్టు తీర్పుచెప్పింది. ట్రాన్స్‌జెండర్, ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డిని ట్రోల్ చేస్తూ దారుణంగా వీడియోలు రూపొందించిన యూట్యూబర్ జోయ్ మైఖేల్ ప్రవీణ్‌కు రూ.50 లక్షల జరిమానా విధించింది.
ఈ మేరకు జస్టిస్ ఎన్.సతీశ్ కుమార్ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. అప్సరా రెడ్డి పరువుకు భంగం కలిగించేలా ఉన్న 10 వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించడంతో ఈ భారీ జరిమానా నుంచి గూగుల్ తప్పించుకుంది. అయితే ఇదే సమయంలో గూగుల్‌కు జస్టిస్ సతీశ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి హానికర కంటెంట్ అప్‌లోడ్ కాకుండా చూసుకోవాలని గూగుల్‌కు సూచించారు.