సుబ్రమణ్య స్వామిపై ఎఫ్ఐఆర్‌

సుబ్రమణ్య స్వామిపై ఎఫ్ఐఆర్‌

రాహుల్​గాంధీని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా కామెంట్స్​ చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామిపై కేసు నమోదు చేసినట్లు చత్తీస్​గఢ్​పోలీసులు చెప్పారు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్ మేరకు ఆయనపై ఐపీసీ ​504, 505, 511 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్​ నమోదు చేశామన్నారు. రాహుల్​గాంధీకి కొకైన్ ​తీసుకునే అలవాటు ఉందని స్వామి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ​పార్టీ నేతలు మండిపడ్డారు. స్వామి ఆరోపణలు నిరాధారమని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలని తెలిసీ రాహుల్​ను నవ్వులపాలు చేయడానికే స్వామి ఈ కామెంట్స్​చేశారని జాష్పూర్​జిల్లా ప్రెసిడెంట్​పవన్​అగర్వాల్ పోలీసులకు కంప్లైంట్​చేశారు. స్వామి స్టేట్​మెంట్​తో పార్టీల మధ్య, ప్రజల మధ్య విద్వేషం రేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నమని ఆరోపించారు. ఏ రకంగా చూసినా  సుబ్రమణ్య స్వామి స్టేట్​మెంట్​ఆమోదయోగ్యం కాదని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ చత్తీస్​గఢ్​అధికార ప్రతినిధి శైలేష్​నితిన్​త్రివేది పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు రాహుల్​గాంధీతో పాటు కాంగ్రెస్​పార్టీ మొత్తానికీ అవమానకరమని చెప్పారు.