Allu Arjun: పుష్ప 2 రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ కి షాక్.. అలా చేశాడని కేసు నమోదు....

Allu Arjun: పుష్ప 2 రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ కి షాక్.. అలా చేశాడని కేసు నమోదు....

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్థార్ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ సినిమా ప్రమోషన్స్ కోసం ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ "అల్లు ఆర్మీ" అనే పదాలని ఉపయోగించాడు.

దీంతో గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు దేశ సరిహద్దులలో దేశ రక్షణకోసం ప్రాణాలని పణంగా పెట్టి పని చేసే సైన్యంతో తన అభిమానులను పోల్చడం సరికాదని అంటున్నారు. 

ALSO READ | RC16 Update: రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీర్జాపూర్ మున్నా భయ్యా..

అలాగే ఈమధ్య మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ఎక్కువయ్యాయని ఈ క్రమంలో అభ్యంతరకరమైన పదజాలంతో దూషించుకుంటున్నారని కాబట్టి వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకూ అల్లు అర్జున్ స్పందించకపోవడం గమనార్హం.

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.