ఉక్రెయిన్‌కు చెందిన అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా (Maria Ryaboshapka) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 2వ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.
శుక్రవారం హీరోయిన్ మారియా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఆమె క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. బ్రిటీష్ యువరాణిగా కనిపిస్తున్న ఆమె ఇందులో క్లారా పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ‘ఆమె ప్రేమ ఒక యుద్ధం’ అని పోస్టర్‌పై ఉండటం ఆసక్తిని పెంచుతోంది.
The intense world of #DavidReddy welcomes its leading lady, Maria Riabhoshapka as Clara Whitmore.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 6, 2026
Her love is War. 🔥
@RiaBhoshapkaM pic.twitter.com/So0WmhpBSb
ఎవరీ మరియా?
హీరోయిన్ మారియా ప్రధానంగా ఉక్రెయిన్ సినిమాల్లో నటిస్తూ నటిగా గుర్తింపు పొందారు. ‘స్పెషల్ ఓపీఎస్ 1.5’ వెబ్‌సిరీస్‌తో ఇండియన్ ఆడియన్స్కు పరిచయమయ్యారు.
►ALSO READ | Ziddi Ziddi Lyrical: ఎదురులేక సాగితే.. నిరాశ నీడ ఓడదా.. దూసుకెళ్తున్న ‘బైకర్’ మోటివేషనల్ సాంగ్
అనంతరం శివ కార్తికేయన్ హీరోగా, అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రిన్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. పుదుచ్చేరి, లండన్ నేపథ్యంలో సాగే ‘డేవిడ్ రెడ్డి’ కథకు తగినట్లుగా ఆమెను మేకర్స్ ఎంపిక చేశారు.
‘డేవిడ్ రెడ్డి’ కథ: 1897–1920 నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన యోధుడిగా మంచు మనోజ్ కనిపించనున్నాడు. ఆర్. పార్తీబన్, కాంచన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నామని మేకర్స్ చెప్పారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
No Mercy and No Turning Back 🔥🏍️#DavidReddy Brutal Era Begins 🤘 pic.twitter.com/2MqxK2pCM2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
