బెంగళూరు: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదని, ఇలా చేయడం చైల్డ్ లేబర్ చట్టం కిందకు వస్తుందని ఓ కన్నడ టీవీ చానెల్‌లో ఇంటర్వూకు వచ్చిన వ్యక్తి అన్నాడు. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దని, అతడు చదువుకోవాలని పేర్కొన్నాడు. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్నమోదు చేయిస్తానని హెచ్చరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. 14 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు కానీ బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్ కింద పరిగణించరని క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది చిన్న వయసులోనే క్రీడల్లో ప్రవేశిస్తారని నెటిజన్లు వాదిస్తున్నారు.
