
హైదరాబాద్ సైఫాబాద్ నిజాం క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. క్లబ్‌లోని రెండో అంతస్తులోని ఆఫీస్ బ్లాక్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరింగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం కావడం మరియు ఉదయం పూట ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.