ఘట్కేసర్, వెలుగు: ఓ పరుపుల ఫోమ్ తయారీ పరిశ్రమలో షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుశాపూర్లో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురు కార్మికులు పరిశ్రమలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.
పరుపుల ఫోమ్కు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. రెండు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమలో ముడిసరుకు మొత్తం కాలి బూడిదైంది. రెండు నెలల క్రితమే పరుపుల ఫోమ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రూ.కోట్ల నష్టం వాటిల్లిందని వాపోయారు.
