
దుండిగల్, వెలుగు: దుండిగల్ మునిసిపల్ తండా 2లోని రాంకీ కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో కెమికల్ రియాక్షన్ జరగడంతో మంటలు అంటుకుని భారీగా వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడగా సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.
జీడిమెట్ల, పఠాన్ చెరు నుంచి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదాన్ని చూసి సమీప తండాల్లో నివాసముంటున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు.