AP News: విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

AP News: విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

ఆంద్రప్రదేశ్ లోని విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో ఆదివారం ( ఆగస్టు 11)  మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తు అడ్మిన్ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే మంటలు ఇతర వార్డులకు అంటుకునే ప్రమాదం ఉండటంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను... సిబ్బంది బయటకు తరలించారు.

నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసామని ఫైర్ సేఫ్టీ అధికారి రేణుకయ్య  తెలిపారు. స్కై లిఫ్ట్ ద్వారా నేరుగా ప్రమాదం జరిగిన అంతస్తులోనే వాటర్ స్ప్రే చేసామన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. ఆసుపత్రిలో పెషేంట్లకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ పూర్తి చేసామని  తెలిపారు

 విశాఖఅగ్ని ప్రమాద ఘటనపై నగర కమీషనర్ ఎస్. బాగ్జీ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో తరుచు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరం అని తెలిపారు. హెఆర్ డిపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. ప్రమాదం జరిగిన వెంటనే రోగులకు ఏమీ జరగకుండా వేరే వార్డులకు షిప్ట్ చేసారని అన్నారు. అనేక మంది ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసుపత్రులకు వస్తారు.. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలని కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికైన మిగిలిన ఆసుపత్రులు సెఫ్టీ ఆడిట్ చేసుకుని అంతా సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు.