విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ఫ్లాంట్ టి.పి.పి-2 లో అగ్నిప్రమాదం జరిగింది. టర్బన్ అయిల్ లీక్ అవ్వటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది గమనించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఎందుకు జరిగిందని అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.