
యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కొండపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. ఫైరింజన్లు… వెంటనే కొండపైకి చేరుకుని.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఆలయ అధికారులు,స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.