సికింద్రాబాద్ దాచా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం.. మూడు ఫ్లోర్లకు వ్యాపించిన మంటలు..

సికింద్రాబాద్ దాచా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం.. మూడు ఫ్లోర్లకు వ్యాపించిన మంటలు..

సికింద్రాబాద్ లోని దాచా కంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం ( జనవరి 14 ) తెల్లవారుజామున కంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సేఫ్టీ సామాన్లు అమ్మే షాపులు, గొడౌన్స్ ఉన్న కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. 

ALSO READ : ట్రేడింగ్ పేరుతో..డైరెక్టర్ తేజ కుమారుడికి ..

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. బిల్డింగ్ లోని మూడు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తెల్లవారుజామున షాపులన్నీ మూసి ఉండటంతో ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదు. అయితే.. భారీగా ఆస్థి నష్టం జరిగి ఉండచ్చని భావిస్తున్నారు.