
శంషాబాద్ లో సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రోజు తెల్లవారుజామున శంషాబాద్ పవర్ సబ్ స్టేషన్ ఆనుకొని ఉన్న ట్రాన్స్ ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. క్షణాల్లోనే ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. అధికారులు స్థానికుల సహకారంతో వెంటనే మంటలను ఆర్పీ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.