ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

శనివారం తెల్లవారుజామున ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోరివాలిలోని ఒక షాపింగ్ సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగకున్నా.. ఆస్తినష్టం మాత్రం ఎక్కువగానే జరిగినట్లు సమాచారం. చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రభాత్ రహంగ్‌డేల్ మాట్లాడుతూ.. ‘షాపింగ్ కాంప్లెక్స్ యొక్క సెల్లార్ లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి 14 ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక షాపు వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కాంప్లెక్స్ యొక్క సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ తెలిపాడు. తెల్లవారుజామున 2:55 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ మాకు సమాచారం ఇచ్చాడు. కాంప్లెక్స్ లోపల 77 షాపులు ఉన్నాయి. దాదాపు అవన్నీ మొబైల్ షాపులే’ అని ఆయన తెలిపారు.

For More News..

యూపీలో రాత్రికి రాత్రే మొదలైన లాక్డౌన్