హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర అగ్ని ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర అగ్ని ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు

హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలక్ట్రిక్ కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆదివారం (నవంబర్ 16) గ్రౌండ్ లో పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రికల్ కార్ లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.

మంటలు పక్కన ఉన్న కార్లకు వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన డ్రైవర్లు.. కార్లను అక్కడి నుండి పక్కకు తీసి ప్రమాద తీవ్రతను తగ్గించారు. మంటలకు కారు పూర్తిగా దగ్దమైంది. మరో కారు పాక్షికంగా డ్యామేజ్ అయ్యింది.