విశాఖలోని క్వారంటైన్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

విశాఖలోని క్వారంటైన్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

విశాఖలోని ఓ క్వారెంటైన్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి  సెంటర్ లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది. ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్‌కు తరలిస్తున్నారు. అయితే సకాలంలో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. నిముషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని స్థానికులు తెలిపారు.