హైదరాబాద్లో కంటైనర్ కార్పోరేషన్ డిపోలో అగ్నిప్రమాదం.. భారీగా వైన్ బాటిల్స్ దగ్ధం

హైదరాబాద్లో కంటైనర్ కార్పోరేషన్ డిపోలో అగ్నిప్రమాదం.. భారీగా వైన్ బాటిల్స్ దగ్ధం

హైదరాబాద్ లోని ఇండియన్ కంటైనర్ కార్పోరేషన్ (ICD) డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డిపోలోని 6,7,8 గోడౌల్ లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. శనివారం (అక్టోబర్ 25) మూసాపేట్ లో ఉన్న డిపోలో సంభవించిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున లిక్కర్ దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గోడౌన్స్ లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.