రంగారెడ్డి జిల్లాలో హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం జరిగింది. బుేధవారం(మే6) ఉదయం హైదర్ షా కోట్ లో హైవేపై ఉన్న KFC, ఫిజ్జా స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెకండ్ ఫ్లోర్ లోని కిచెన్ స్టోర్ నుంచి మంటలు, దట్టమైన పొగలు రావడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. కిచెన్ లోని గ్యాస్ సిలిండర్లు పేలే అవకాశం ఉండటంతో కిందకి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో జరిగిన నష్టం, ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
