ప్రముఖ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఎఫ్డీ వడ్డీరేట్లు.. వివరాలివిగో..

ప్రముఖ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఎఫ్డీ వడ్డీరేట్లు.. వివరాలివిగో..

FD Interest Rates 2024: ఫిక్స్ డ్ డిపాజిట్లు (FD) భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. నాన్ మార్కెడ్ లింక్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్లలో నమ్మకమైన రిటర్స్న్ ను కోరుకునే  ఇన్వెస్టర్లు FD ని నమ్మదగిన పెట్టుబడి పథకంగా ఎంచుకుంటారు. 

బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) లు కూడా FD లను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే ఎక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై పెట్టుబడిదారులకు మెచ్యూరిటీ వడ్డీని అందిస్తున్నాయి. 5 సంవత్సరాల FDలపై కూడా ఇన్వెస్టర్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నా యి. చాలా బ్యాంకులు, NBFC లు వివిధ రకాల FDలను వివిధ రకాల కాలవ్యవధులు, అమౌంట్లతో ఆఫర్ చేస్తున్నాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రముఖ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో FDలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు అందస్తున్న వివిధ రకాల FD స్కీంలను గురించి వివరంగా తెలుసుకుందాం. 

యాక్సిస్ బ్యాంక్

17 నెలల నుంచి 18 నెలల లోపు స్కీమ్‌లో బ్యాంక్ ఏటా 7.20 శాతం అత్యధిక వడ్డీ రేటు అందిస్తుంది.బ్యాంకు ఏడాది వ్యవధి ఫిక్స్ డ్ డిపాజిట్లకు 6.70 శాతం, రెండేళ్ల డిపాజిట్లకు 7.10 శాతం, 5 ఏళ్ల FDకి 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 

HDFC బ్యాంక్

మార్కెట్ విలువ పరంగా దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు 18 నెలల నుండి 21 నెలల లోపు వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్లకు అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాది వ్యవధిగల FDలకు 6.60 శాతం, మూడేళ్ల FD, ఐదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీరేట్లను అందిస్తోంది. 

ICICI బ్యాంక్

ICICI  బ్యాంక్ 15 నెలల నుంచిరెండేళ్లలో స్కీమ్ లలో అత్యధికంగా 7.20 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ఏడాది స్కీం కు 6.70 శాతం, మూడు, ఐదేళ్ల FD లకు 7 శాతం వడ్డీరేటును అమలు చేస్తుంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా 

BoB 2 -3 సంవత్సరాలకు పైగా FDలకు7.25 శాతం అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాది FD కి 6.85 శాతం, మూడు, ఐదేళ్ల కాల వ్యవధి గల FDలకు వరుసగా  6.85 శాతం, 7.25శాతం,అందిస్తోంది. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్

PNB 400 రోజుల FD కోసం అత్యధిక వడ్డీ రేటును 7.25 శాతం వద్ద ఉంచింది. 1-సంవత్సరం FDలో వడ్డీ రేటు 6.75 శాతం, 3,5 సంవత్సరాల FDలకు వరుసగా 6.50 శాతం, 7.00 శాతం వడ్డీరేట్లను అందిస్తోంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI 400 రోజుల అమృత్ కలాష్ పథకంలో అత్యధిక FD వడ్డీ రేటును 7.10 శాతంగా అందిస్తుంది. ఏడాది FDలకు 6.80 శాతం, మూడు, ఐదేళ డ్యురేషన్ గల FDలకు వరుసగా 6.50 శాతం, 6.75 శాతం వడ్డీరేట్లను అందిస్తుంది. 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. 444 రోజుల పథకంలో అత్యధిక వడ్డీ రేటును 7.30 శాతంగా అందిస్తోంది. ఏడాది ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో 6.90 శాతం, మూడు, ఐదేళ్ల వ్యవధి గల FDలకు 6.50 శాతం వడ్డీరేటును అందిస్తోంది.