
హైదరాబాద్: మణికొండలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం(అక్టోబర్12) సాయంత్రం 4 గల ప్రాంతంలో మణికొండలోని BRC అపార్టుమెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఎగిసిపడుతున్న మంటలను చూసి అపార్టుమెంట్ లో నివసించేవారు భయంతో పరుగులు పెట్టారు. కిందకు పరుగులు పెట్టే క్రమంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
BRC అపార్టుమెంట్ లో అగ్నిప్రమాదంతో ఎలక్ట్రిక్ డక్ యూనిట్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. 19 ఫోర్లకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.