కూకట్ పల్లి లోధా హైరైజ్ టవర్స్ లోని ప్లాట్ లో మంటలు

కూకట్ పల్లి లోధా హైరైజ్ టవర్స్ లోని ప్లాట్ లో మంటలు

హైదరాబాద్ సిటీ కోర్ ఏరియా అయిన కూకట్ పల్లి ఫోర్త్ ఫేజ్  హౌసింగ్ బోర్డు నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో ఉన్న లోధా అపార్ట్ మెంట్స్ లోని ఓ ప్లాట్ లో మంటలు వచ్చాయి.  ఈ అపార్ట్ మెంట్ లోని  హైరైజ్ టవర్స్‌లో ఒకటైన 2B టవర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ టవర్‌లోని 29, 30 అంతస్తుల్లో ఉన్న ఓ డూప్లెక్స్ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఫ్లాట్ నుంచి భారీగా పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ALSO READ : ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీల ఓనర్లపై కేసు పెట్టండి..

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. ప్రాణభయంతో టవర్లలోని నివాసితులంతా మెట్ల మార్గ ద్వారా కిందకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. . ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు  వెళ్లినట్లు సమాచారం.