షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో నష్టం

 షూ ఫ్యాక్టరీలో భారీ  అగ్నిప్రమాదం..   లక్షల్లో నష్టం

ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో ఫిబ్రవరి 11 వ తేదీ ఆదివారం రోజున భారీ  అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.  అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.   అయితే ఫ్యాక్టరీ లోపల నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.

మరో ఘటనలో తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సుమారు గంటపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి ఉదయం 11 గంటలకు మంటలను అదుపు చేశామన్నారు.  షార్ట్ సర్క్యూట్‌గా కారణంగా అగ్నిప్రమాదానికి జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.  

ALSO READ :- OTTకి ట్రూ లవర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?