బాబోయ్ ఎండలతో.. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

బాబోయ్ ఎండలతో.. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎలక్ట్రిక్ వెయికిల్ అయినా పెట్రోల్, డీజిల్ వెయికిల్స్ ఏవైనా మంటలు చెలరేగుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది వాహనదారులు అలర్ట్ గా ఉండాలి. కారణాలు ఏవైనా ఈ మధ్య రోడ్డపైనే రన్నింగ్ లో ఉండగానే కారు, ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో 2024 మార్చి 19 మంగళవారం ఓ పెట్రోల్ బంక్ ముందు రోడ్డుపై కారు తగలబడిపోయింది. 

ఉన్నట్టుండి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారులో నుంచి దట్టంగా పొగలు వ్యాపించి... చూస్తుండగానే కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. కారును జేసీబీ సహాయంతో ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లక్డీకపూల్ లో ఇలాంటి ఘటనే జరిగింది.