
హైదరాబాద్ బంజారాహిల్స్ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 11 లోని స్కైబ్లూ హోటల్ మూడో అంతస్తులో మొదలైన మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ఫ్లోర్‌లోని ఫర్నిచర్ తగులబడిపోయాయి. ఈ ప్రమాదంతో హోటల్ సిబ్బంది తో పాటు కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.