హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..ఆలు చిప్స్ కంపెనీలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..ఆలు చిప్స్ కంపెనీలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి,పాపి రెడ్డి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది.  సూర్య ఎంటర్ ప్రైజెస్(ఆలు చిప్స్ కంపెనీ) గోదాములో జులై 16న ఉదయం తెల్లవారు జామున 3 గంటలకు   మంటలు చెలరేగాయి.  దట్టమైన పొగలకు  కంపెనీ పక్కన ఉన్న ఇండ్ల చుట్టూ అలుముకున్నాయి.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ,ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్ లో ఈ మధ్య తరచూ ఏదో చోట నిత్యం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే పాశమైలారం సిగాచీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదానికి 44 మందిచనిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా 8 మంది మృతదేహాల ఆచూకీ ఇంత వరకు  జాడలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.