ప్రయాణిస్తున్న కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

ప్రయాణిస్తున్న కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్రనగర్ లో కారు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. ఇందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా వారు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

కారులో ప్రయాణిస్తుండగా పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపేశాడు. వెంటనే అందులో ఉన్న యువకులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాలో కారు అగ్నికి అహుతి అయిపోయింది. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా..అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే మీదుగా మెహదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.