వీడియో: రాజమండ్రిలో శానిటైజర్ తో మంటలు.. కాలిన బైక్..

వీడియో: రాజమండ్రిలో శానిటైజర్ తో మంటలు.. కాలిన బైక్..

కరోనా భయంతో మీరు శానిటైజర్ వాడుతున్నారా?  అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. బైకు మీద బయటకు వెళ్లినప్పుడు..  శానిటైజర్ బైకులో పెట్టుకొని వెళ్తున్నారా? అయితే మరీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకు ఇంతలా చెబుతున్నామో.. ఈ ఘటన చూస్తే మీకే అర్థమవుతుంది.

బైకు కవర్ లో పెట్టిన శానిటైజర్ వల్ల మంటలు చెలరేగి బైకు కాలిపోయిన ఘటన రాజమండ్రిలో జరిగింది. దేవీచౌక్ సెంటర్లో ఆపి ఉన్న బైకు కవర్లోని శానిటైజర్ ఎండ వేడికి నిప్పంటుకుంది. దాంతో మంటలు చెలరేగి.. బైకును అంటుకున్నాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లు బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పారు. అది బైకులో ఉంది కాబట్టి సరిపోయింది. అదే మనిషి పాకెట్ లో ఉంటే పరిస్థితి ఏంటో అని జనాలు భయపడుతున్నారు. శానిటైజర్ వల్ల ఎందుకు మంటలు వచ్చాయో తెలియక జనాలు ఆందోళనపడుతున్నారు. ఇలా అయితే శానిటైజర్లు ఎలా వాడాలి అని ప్రశ్నిస్తున్నారు.

For More News..

బుల్లెట్ మీద నుంచి కిందపడ్డ హీరోయిన్

పెళ్లికి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా.. టెన్షన్ లో పెళ్లి బృందం

హైదరాబాద్ లో ఏరియా వైజ్ కరోనా కేసులు ఇవే..