దీపావళి వేడుకలో పటాకులతో జాగ్రత్త..ప్రజలకు ఫైర్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ డీజీ విక్రమ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌ సూచన

దీపావళి వేడుకలో పటాకులతో జాగ్రత్త..ప్రజలకు ఫైర్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ డీజీ విక్రమ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌ సూచన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దీపావళి వేడుకలో పటాకులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ డీజీ విక్రమ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌ సూచించారు. 2023లో దీపావళి పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో 164 అగ్నిప్రమాద ఘటనలు నమోదు కాగా.. 2024లో 95 ప్రమాదాలు జరిగినట్టు వివరించారు. ఫైర్ యాక్సిడెంట్లను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తూ శనివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,019  తాత్కాలిక బాణసంచా దుకాణాలకు  తాత్కాలిక లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు జారీ చేసినట్టు తెలిపారు. 2024లో 7,516 దుకాణాలకు, 2023లో 6,439 దుకాణాలకు లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు జారీ చేసినట్టు వెల్లడించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలకు, బాణసంచా విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. మంటలు అంటుకుంటే తక్షణం స్పందించేలా క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ టెండర్‌‌‌‌‌‌‌‌లను(క్యూఆర్‌‌‌‌‌‌‌‌టీలు) ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో పెట్టనున్నట్టు వెల్లడించారు. 24 గంటలపాటు ఫైర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూం పనిచేస్తుందన్నారు.