ఫైర్ సర్వీసెస్‌‌, ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ను బలోపేతం చేస్తం : సీవీ ఆనంద్

ఫైర్ సర్వీసెస్‌‌, ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ను బలోపేతం చేస్తం :  సీవీ ఆనంద్
  • హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ వెల్లడి

హైదరాబాద్‌‌,వెలుగు: ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌)ను మరింత బలోపేతం చేస్తామని హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ అన్నారు. శాఖాపరమైన సవాళ్లు, పెండింగ్‌‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఫైర్ సర్వీసెస్‌‌ సిబ్బందికి హామీ ఇచ్చారు. 

హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తరువాత బుధవారం మొదటిసారి ఆయన  నానక్‌‌రామ్‌‌గూడలోని తెలంగాణ అగ్నిమాపకశాఖ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను సందర్శించారు. ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్‌‌తో కలిసి సిబ్బందితో  చర్చించారు. ఫైర్ డిపార్ట్‌‌మెంట్‌‌పై ఆరా తీశారు. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్‌‌లో వినియోగిస్తున్న టెక్నాలజీ, అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయాల్లో సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు.