సల్మాన్ ఖాన్‎తో పని చేస్తే ఎవరైనా సరే.. గుండెలపై కాల్చి చంపుతం: బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

సల్మాన్ ఖాన్‎తో పని చేస్తే ఎవరైనా సరే.. గుండెలపై కాల్చి చంపుతం: బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

ఒట్టోవా: కెనడాలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‎పై దుండగులు కాల్పులు జరిపారు. గురువారం (ఆగస్ట్ 7) రాత్రి జరిగిన ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. కపిల్ శర్మ కేఫ్‎పై మేమే కాల్పులు జరిపామని ప్రకటించుకుంది. ఈ దాడికి సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. కపిల్ శర్మ కేఫ్‎పై ఎందుకు దాడి చేశామనేది ఆడియోలో వివరించాడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు, గ్యాంగ్‌స్టర్ హ్యారీ బాక్సర్. 

‘‘కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 3కి బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‎ను చీఫ్ గెస్ట్‎గా పిలిచారు.. ఇది నచ్చకే కపిల్ శర్మ కేఫ్‎పై రెండుసార్లు కాల్పులు జరిపాం. సల్మాన్‌తో కలిసి పనిచేసే ఏ దర్శకుడు, నిర్మాత లేదా యాక్టర్లు ఎవరైనా సరే మేము ఎవరినీ వదిలిపెట్టం. వారిని ఛాతీపై కాల్చి చంపుతాం. వారిని చంపడానికి ఎంతకైనా తెగిస్తాం’’ అని సల్మాన్ ఖాన్ తో కలిసి పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు హ్యారీ బాక్సర్. 

Also Read : అదిరిపోయిన ‘జడల్’అప్డేట్

కాగా,  2025, జూన్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 3 మొదటి ఎపిసోడ్‌కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. 1998లో బిష్ణోయ్ సమాజం గౌరవించే కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ వేటాడని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‎పై పగ పెంచుకుంది. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ఖాన్‎ను చంపేందుకు ప్రయత్నాలు చేసింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.