TheParadise: అదిరిపోయిన ‘జడల్’అప్డేట్.. నెవర్ బిఫోర్ లుక్‍లో నాని.. ‘కడుపు మండిన కాకుల కథ’

TheParadise: అదిరిపోయిన ‘జడల్’అప్డేట్.. నెవర్ బిఫోర్ లుక్‍లో నాని.. ‘కడుపు మండిన కాకుల కథ’

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ వచ్చే ఏడాది (2026 మార్చి 26న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవాళ (ఆగస్ట్ 8న) ది ప్యారడైజ్ నుండి నాని ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో నాని పాత్రను ‘జడల్’ అని పరిచయం చేసిన పోస్టర్ గూస్బంప్స్ కలిగిస్తుంది. "అతను నరకంలోకి నడిచి దానిని స్వర్గంగా మారుస్తాడు" అని ఇచ్చిన క్యాప్షన్ స్టోరీపై ఆసక్తి రేపుతోంది.

ఇందులో నాని రెండు జడలతో, డీసెంట్ కళ్ళద్దాలు పెట్టుకుని రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాని వెనుకాల విభిన్నరకాల గన్స్, కత్తులు.. కుప్పలు కుప్పులుగా పడున్న మనుషులు, ఎదురుగా ఎగురుతున్న కాకులు.. ఇలా ప్రతిదీ ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్  సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

కడుపు మండిన కాకుల కథ: 

చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిండ్రు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే” అంటూ ఫీమేల్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన గ్లింప్స్ కథను చెప్పకనే చెప్పింది. "గిది కడుపు మండిన కాకుల కథ. జమానా.. జమానా కెల్లి నడిచే శవాల కథ” అంటూ డైలాగ్స్ సైతం సినిమా స్థాయిని ఒక్క గ్లింప్స్ తోనే శ్రీకాంత్.. ఆడియన్స్ ఊహలకు వదిలేశాడు. మరి సినిమా ఎలాంటి కథ, కథనాలతో వస్తుందో చూడాలి.  

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. కాగా నాని శ్రీకాంత్ కాంబోలో వచ్చిన 'దసరా' బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే.