
ఢిల్లీలోని ఛతర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. గురువారం(మే15) మధ్యాహ్నం స్కార్పియోలో వెళ్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
సిడిఆర్ చౌక్ పీఎస్ మెహ్రౌలి సమీపంలో కాల్పుల సంఘటన మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.కారులో ఉన్న అయా నగర్ నివాసి బాధితుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.. ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VIDEO | Delhi: Man shot at multiple times near Chhatarpur Metro Station, rushed to hospital. The incident occurred around 1 pm. More details awaited.
— Press Trust of India (@PTI_News) May 15, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/O0n9j87VOd