కౌంటింగ్ కోసం 41 రోజులు టెన్షన్..టెన్షన్

కౌంటింగ్ కోసం 41 రోజులు టెన్షన్..టెన్షన్

నిన్న మొన్నటి దాకా ప్రచారంలో బిజీగా గడిపిన క్యాండిడేట్లు ఇప్పుడు నెలన్నర రోజులపాటు టెన్షన్‌టెన్షన్‌గా గడపాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలక్షన్ రిజల్ట్ కోసం ఏకంగా 41రోజుల పాటు ఎదురుచూడాల్సి రావడమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా లోక్ సభ తొలిదశ ఎన్నికలు గురువారం ముగిశాయి. మరో ఆరు దశలపాటు జరగనున్న ఎన్నికలు.. మొత్తంగా మే 19న ముగుస్తాయి. మే23న దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుంది. అప్పటిదాకా ఎదురు చూపులు తప్పవు. 2004లో ఏప్రిల్ 26న పోలింగ్‌ జరగ్గా మే13న ఫలితాలు వెలువడ్డాయి. ఆ రెండింటికి మధ్య16 రోజుల గ్యాప్ ఉంది. 2009లో ఏప్రిల్ 16,23న రెండు దశల్లో పోలింగ్‌ జరగ్గా ఫలితాలు మే16న వెలువడ్డాయి. వాటి మధ్య 30 రోజుల గ్యాప్ ఉంది. 2014లో ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగ్గా, మే 7న ఏపీలో జరిగాయి. మే16న ఫలితాలొచ్చా యి. ఈసారి తొలి దశలోనే తెలంగాణ,ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23నఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలతోపాటు, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలఎన్నికలు ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొం ది.క్యాండిడేట్లు, పార్టీల గెలుపోటముల మీద భారీగాబెట్టింగులు, విశ్లేషణలు సాగుతున్నాయి.

అభివృద్ధికి బ్రేక్!

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ మే 28 వరకు కొనసాగనుంది. దీంతో అప్పటిదాకా ప్రభుత్వ కొత్తపథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,నిధుల విడుదలకు బ్రేక్‌ పడనుంది. తెలంగాణలోగతేడాది సెప్టెంబర్ నుంచి వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల, వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అవిమొదలైతే అప్పుడు కూడా కోడ్‌ అమల్లో ఉంటుంది.అటు దేశవ్యాప్తంగాకే వలం లోక్ సభ ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలం కోడ్ కారణంగా అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారనుంది.