కొత్త చట్టాలు అమలు..హైదరాబాద్​ లో తొలి కేసు నమోదు

కొత్త చట్టాలు అమలు..హైదరాబాద్​ లో తొలి కేసు నమోదు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి ( జులై 1) అమల్లోకి వచ్చాయి.  అలా వచ్చాయో లేదో.. ఈ చట్టాల కింద కేసులు నమోదవుతున్నాయి.  కొత్త చట్టలు అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే కేసులు నమోదవుతున్నాయి.  అంటే ప్రజలు ఏమేరకు  చట్ట వ్యతిరేకకలాపాలకు పాల్పడుతున్నారో అర్దమవుతుంది.  చార్మినార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ కేసు నమోదైంది. నెంబర్​ ప్లేట్​ లేకుండా  నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై  కొత్త చట్టంకింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ను డిజిటల్ గా నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చార్మినార్​ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్న నెంబర్ ప్లేట్​ లేని వాహనాన్ని గుర్తించారు.  వీరిలో ఒకరు గిల్​ వర్కర్​ కాగా.. మరొకరు హోటల్​ వర్కర్​ వీరు ఇంటికివెళుతున్నారు.  బీఎన్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశామని విచారణ జరుగుతుందని తెలిపారు. ఇంకా సైబరాబాద్​ పరిధిలోని జగద్గిరిగుట్టలో 194 సెక్షన్​ కింద రెండు ఆత్మహత్యలు కేసులు నమోదు చేశారు. ఇవి గతంలో 174 సెక్షన్​ పరిధిలోకి వస్తాయి.