ఒలంపిక్స్‌ విలేజ్‌లో తొలి కరోనా కేసు

ఒలంపిక్స్‌ విలేజ్‌లో తొలి కరోనా కేసు

ఒలంపిక్స్‌ విలేజ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. నైజిరియాకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కరోనా వచ్చిన వ్యక్తి అథ్లెట్ కాదని సమాచారం. ఎయిర్ పోర్టులో మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లు గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. ఆర్గనైజింగ్ టీంకు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు టోక్యో ఒలంపిక్స్ సీఈఓ థోషిరో మ్యూటో తెలిపారు. జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. సేఫ్ అండ్ సెక్యూర్‌గా గేమ్స్ నిర్వహిస్తామని ఇప్పటికే నిర్వహకులు చెప్పారు. ఇక గేమ్స్ జరుగుతున్న టోక్యోలో ఎమర్జెన్సి విధించారు.