ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్

ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి  ఫస్ట్ డే ఫస్ట్ షో  సాంగ్

రామ్  పోతినేని,  భాగ్య శ్రీ బోర్సే జంటగా  ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్  పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.  ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, బుధవారం నాలుగో పాటను విడుదల చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ సాగే ఈ పాటను హైదరాబాద్‌‌‌‌ బాలనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ థియేటర్‌‌‌‌‌‌‌‌లో అభిమానుల మధ్య లాంచ్ చేశారు. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. 

‘‘అన్నకు మేమే ఫ్యాన్స్‌‌‌‌, ఇప్పుడేస్తాం రా డ్యాన్స్‌‌‌‌.. వచ్చిందిరా పిలుపు.. అన్నదేరా గెలుపు.. మావోడి గ్లామరు పాపలకే ఫీవరు.. ఆల్‌‌‌‌ ఆన్‌‌‌‌ యు సింగు.. ఆంధ్రాకే కింగు” అంటూ అభిమాన హీరో గురించి ఫ్యాన్స్‌‌‌‌ పాడుకునేలా దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. స్టార్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఫ్యాన్స్‌‌‌‌ చేసే హంగామాను రీ క్రియేట్‌‌‌‌ చేసేలా సాగిన ఈ పాటలో రామ్ ఎనర్జిటిక్ మాస్‌‌‌‌ డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు.  కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్​, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ  ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ  మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 28న విడుదల కానుంది.