జులైలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసు బంద్!

V6 Velugu Posted on Jun 22, 2021

  • వ్యాక్సిన్‌‌ సెకండ్ డోసు వాళ్లకే వేసే అవకాశం
  • సెకండ్ డోసు కోసం 34.76 లక్షల మంది వెయిటింగ్​
  • అందుబాటులో ఉన్న డోసులు 31.75 లక్షలు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్  బంద్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ డోసు వేసుకోవాల్సిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, వ్యాక్సిన్  డోసులు తక్కువగా ఉండడంతో ఫస్ట్ డోసు బంద్ పెట్టాలని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. ఈ నెల 22  నుంచి జులై చివరి వరకూ సెకండ్ డోసు వేసుకోవాల్సిన వాళ్లు 34 లక్షల 76 వేల మంది ఉన్నారు. ఈ 40 రోజుల్లో తెలంగాణకు 31.75 లక్షల వ్యాక్సిన్  డోసులు పంపించనున్నట్టు రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​కు ఆరోగ్య శాఖకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  సోమవారం సమాచారం ఇచ్చింది. దీంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసు వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, సెకండ్ డోసు మాత్రమే వేయడానికి ఆస్కారం ఉందని స్టేట్​ హెల్త్  డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. వ్యాక్సిన్  డోసుల షార్టేజ్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఫస్ట్  డోసు ఆపేయడానికి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
టీచర్లకు వ్యాక్సిన్!
రాష్ట్రంలోని గవర్నమెంట్ వ్యాక్సిన్ సెంటర్లలో రిస్క్ టేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తున్నారు. వీళ్లందరికీ వ్యాక్సిన్ వేయడం ఒకట్రెండు రోజుల్లో  ఆపేయాలని నిర్ణయించారు. జులై నుంచి స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం అవుతున్నందున టీచర్లు అందరికీ వ్యాక్సిన్ వేయాలని హెల్త్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు కలిపి ఐదు లక్షల మంది ఉంటారని ఆఫీసర్ల అంచనా. మనకు వచ్చే 31.75 లక్షల నుంచి ఈ ఐదు లక్షలు తీసేస్తే 26.75 లక్షల డోసులు ఉంటాయి. వీటిని సెకండ్ డోసు వాళ్లకు వేయడానికి వాడనున్నారు. సెకండ్ డోసు వేయించుకోవాల్సిన వాళ్లలో కొంత మంది ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని, దీంతో టీచర్లకు వేయడం వల్ల ఇబ్బంది ఉండదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 
ప్రైవేటు కోటాలో 6 లక్షల డోసులు
 దేశంలో తయారు అవుతున్న వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 25 శాతం డోసులను ప్రైవేటు హాస్పిటళ్లకు అమ్ముతున్నారు. కంపెనీలు నేరుగా హాస్పిటళ్లకు అమ్మకుండా.. కేంద్ర ప్రభుత్వమే ఆ 25 శాతం డోసులను తీసుకొని జనాభా ఆధారంగా వాటిని రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ కేటగిరీలో జులైలో మన రాష్ట్రానికి 6 లక్షల డోసులు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చిన్న, పెద్ద హాస్పిటళ్లకు సమానంగా ఈ వ్యాక్సిన్లను కేటాయించాలని కేంద్రం సూచించింది. జిల్లాల్లో ఉన్న జనాభా, డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఏ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంతివ్వాలనే నిర్ణయం హెల్త్  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 270  ప్రైవేట్ హాస్పిటళ్లు వ్యాక్సినేషన్  పర్మిషన్ తీసుకున్నాయి. కేంద్రం ఇచ్చే 6 లక్షల డోసులను ఈ అన్ని హాస్పిటళ్లకు డీహెచ్ కేటాయించనున్నారు.18 ఏండ్లు నిండిన వాళ్లెవరైనా, ఏ డోసైనా  ప్రైవేట్ సెంటర్లలో తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. 
ఆపక తప్పదేమో!
జులైలో 25.94 లక్షల మంది కొవిషీల్డ్ సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డోసు, 6 లక్షల మంది కొవాగ్జిన్​ సెకండ్ డోసు వేసుకోవాల్సి ఉంది. మనకు జులైలో వచ్చే డోసులు వీళ్లకు వేయడానికి కూడా సరిపోవు. అందుకే ఫస్ట్  డోసు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మన దగ్గర ఉన్న పరిస్థితిని కేంద్రానికి వివరించి, వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా పంపించాలని కోరుతున్నాం. ఒకవేళ ఎక్కువ డోసులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తే, రిస్క్ టేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మహిళా సంఘాలకు ఫస్ట్  డోసు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేస్తాం. ప్రైవేటు సెంటర్లలో మాత్రం 18 ఏండ్లు దాటిన వాళ్లందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.
                                                                                                                                    - డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్,    పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

Tagged first dose, closed, corona, Vaccine, July,

Latest Videos

Subscribe Now

More News