విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఒమిక్రాన్.అనేక దేశాల్లో ఇప్పటికే ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ఇప్పుడు భారత్ లో కూడా ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా  ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదదైంది. విజయనగరం జిల్లాలో ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన అతడు ముంబైకి చేరుకున్నాడు. అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులో ఆయనకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. విజయనగరంలో రీ-టెస్టు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతని శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వైద్యాధికారులు పంపించారు. ఇటీవల విదేశాల నుంచి ఏపీకి 15 మంది వచ్చారు. మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో వారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు అధికారులు. అందులో 10 మంది ఫలితాల్లో ఒకరికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది.