లోక్ సభ సమావేశాలకు రెడీ : అదేరోజు మంత్రివర్గం ప్రమాణస్వీకారం

లోక్ సభ సమావేశాలకు రెడీ : అదేరోజు మంత్రివర్గం ప్రమాణస్వీకారం

తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి 18వ లోక్ సభ సమావేశానికి ముహుర్తం ఫిక్స్ చేసింది. జూన్ 25 (సోమవారం) 11గంటలకు 18వ లోక్ సభ ఫస్ట్ సెషన్ ప్రారంభకానుంది. ఉదయం 11 గంటల నుంచి ప్రధాని మోదీ, ఆయన మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఇతర మంత్రి మండలి ప్రమాణ స్వీకారం ఉంటుంది.

అనంతరం వివిధ రాష్ట్రాల ఎంపీలు ఆల్ఫబెట్ లెటర్స్ ఆర్డర్ (రాష్ట్రాల పేర్ల ఇంగ్లీష్ అక్షరాలు)లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి రోజున మంత్రి వర్గంతోపాటు మరో 280 మంది ఎంపీలు, తర్వాత రోజు మిగిలిన (జూన్ 25)న 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.

సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణం చేయిస్తారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో అధ్యక్షుడు ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారంభమవుతుంది. జూలై 2 లేదా 3న చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.