భీమా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌ విడుదల

భీమా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌ విడుదల

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్  ‘భీమా’.  కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.  మార్చి 8న సినిమా రిలీజ్ కానుంది. మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌ను విడుదల చేశారు.

‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేసిన  రొమాంటిక్ సాంగ్‌‌లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా, మాళవిక శర్మ స్కూల్ టీచర్‌‌‌‌గా కనిపిస్తున్నారు. ‘ఏదో ఏదో మాయ.. అనుకుంటూనే పడిపోయా.. నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయి.. అందం కావాలంటే అడగాలేమో నీ చాయ’ అంటూ  వీరిద్దరి మధ్య సాగే ప్రేమను చూపేలా కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాశాడు.  అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో మరో హీరోయిన్‌‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.