
- ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బతుకమ్మను, పండుగ పాటలను కించపరుస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను, పాటలను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
సొంత ఇంటి ఆడ పడుచులను గౌరవించని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆడుపడుచులను గౌరవిస్తామంటే సమాజం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. బతుకమ్మ పాటలను అగౌరపరిచేలా పాడటానికి, అందుకు ప్రేరేపించిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.