విద్యావిధానంపై కేటీఆర్, హరీశ్‌‌‌‌వి తప్పుడు ఆరోపణలు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

విద్యావిధానంపై కేటీఆర్, హరీశ్‌‌‌‌వి తప్పుడు ఆరోపణలు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌‌‌‌లు రేవంత్ సర్కార్‌‌‌‌‌‌‌‌పై ఓర్వలేకనే రాష్ట్రంలో విద్యా విధానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిషరీస్ ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఆరుట్ల స్కూల్‌‌‌‌ను బీఆర్ఎస్ నేతలు సందర్శించి, రాష్ట్రంలోని విద్యా విధానం ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.