కర్నాటకలో మూడ్రోజుల పాటు అధికారుల పర్యటన

కర్నాటకలో మూడ్రోజుల పాటు అధికారుల పర్యటన
  • చేపల పెంపకం,విక్రయాలపై స్టడీ టూర్​

హైదరాబాద్, వెలుగు: మత్స్యశాఖ అధికారులు కర్నాటకతో పాటు రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. మత్స్యకారుల ఉపాధి, అభ్యున్నతి కోసం చేపల పెంపకం, విక్రయాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై  అధ్యయనం చేయనున్నారు. ఆదివారం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం కర్నాటకకు బయల్దేరి వెళ్లింది.

 బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో 13వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది.  ఈ సందర్భంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ.. పదేండ్లలో చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ నాయకులు రూ. కోట్లు లూటీ చేశారని ఆరోపించారు.