తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

కాలిపోయిన బైకులు, కార్లు 10 ఇండ్లు ధ్వంసం
రెండు వర్గాల మధ్య గొడవ.. 43 మంది అరెస్ట్

చెన్నై: తమిళనాడులో రెండు వర్గాల మధ్య ఉన్న గొడవలు హింసాత్మకంగా మారాయి. ఒక వర్గం, మరో వర్గం వ్యక్తిని చంపడంతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బాధితుడి సపోర్టర్లు ప్రత్యర్థుల పడవలు, ఇండ్లు, బైకులు, కార్లను తగులబెట్టారు. ఈ ఘటనలో పోలీసులు 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. కడలూరు జిల్లాలోని థాజంగూడ గ్రామానికి చెందిన మసిలమణి గుండు ఉప్పలవాడి పంచాయతీ మాజీ ప్రెసిడెంట్. ఈయన సోదరుడు, మత్స్యకారుడు మడివనన్(36) శనివారం రాత్రి కడలూరు నుంచి బైక్ పై వస్తుండగా.. 10 మంది ప్రత్యర్థులు ఆయనను నరికి చంపారు. దీంతో ఆగ్రహానికి గురైన మసిలమణి సపోర్టర్లు ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసంచేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో హింస జరిగిందని.. 20 బోట్లు, 10 ఇండ్లు, కార్లు, బైకులు తగలబడిపోయాయని పోలీసులు తెలిపారు. వెంటనే స్పాట్ కు వెళ్లి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందని వివరించారు. రెండు గ్రూపుల మధ్య కొన్నేళ్లుగా గొడవ జరుగుతోందని ఎస్పీ ఎం.శ్రీ అభినవ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ రెండు గ్రూపుల మధ్య గొడవ జరగ్గా కేసులు నమోదు చేశామన్నారు. ఆ తర్వాత ఎలాంటి గొడవలకు వెళ్లొద్దని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని, కానీ ఆ ఒప్పందాన్ని మీరడంతో వల్లే ఈ దారుణం జరిగిందన్నారు.

ఎలక్షన్లలోనే గొడవ మొదలు…
థాజంగూడ గుండు ఉప్పలవాడి పంచాయతీలో ఉంది. ప్రస్తుత ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ ఫ్యామిలీల మధ్య గొడవలే మడివనన్ హత్యకు కారణం. మడియాజగన్ భార్య శాంతి , మసిలమణి భార్య ప్రవీణ 2019 డిసెంబర్ లో జరిగిన ఎలక్షన్లలో పోటీ చేయగా.. ప్రవీణను శాంతి ఓడించింది. ఎలక్షన్ల టైమ్ లోనే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

For More News..

పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?

చుక్ చుక్.. గప్ చుప్.. రైళ్లు రాలేదు.. బొగ్గు పోలేదు

డేంజర్లో మంజీర బ్రిడ్జీ.. అధిక లోడ్ తో వెళ్తే ఊగుతున్న బ్రిడ్జీ..