వికారాబాద్, వెలుగు: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 8న ఉదయం 9 గంటలకు వికారాబాద్ కలెక్టరేట్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకన్న తెలిపారు. ఈ సదస్సులో మత్స్య సంపద పెంపు, చెరువుల్లో కలుపు నివారణ, వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
