
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజీ కూడా వర్షాల వల్ల పొంగి పొర్లుతుంది. దాంతో అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ప్రాజెక్టులోని నీటితో పాటు చేపలు కూడా నీటి ప్రవాహంలో దిగువకు కొట్టుకొచ్చాయి. దాంతో బ్యారేజీ దిగువ ప్రాంతంలో ఎక్కడ చూసినా చేపలే దర్శనం ఇచ్చాయి. బ్యారేజీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేపలను పట్టుకెళ్తున్నారు.
For More News..